దొండ @ రూ.100
దొండకాయ టమాటాను మించిపోతోంది. రుచిలో కాదు.. ధరలో! ప్రస్తుతం దొండకాయలు పండే సీజన్. సాధారణంగా కిలో ధర రూ.20 ఉండాలి. మూడు రోజుల క్రితం రూ.60 ఉండగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని
దొండకాయ టమాటాను మించిపోతోంది. రుచిలో కాదు.. ధరలో! ప్రస్తుతం దొండకాయలు పండే సీజన్. సాధారణంగా కిలో ధర రూ.20 ఉండాలి. మూడు రోజుల క్రితం రూ.60 ఉండగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో శనివారం ఏకంగా రూ.100 పలికింది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దొండకాయలు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నుంచి దిగుమతి అయ్యేవి. అక్కడ అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతింది. ప్రస్తుతం హుబ్బళ్లి నుంచి తెప్పిస్తున్నారు. ఈ కారణంగానే ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు.
-న్యూస్‌టుడే, డోర్నకల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్