873 ఎకరాల భూసేకరణకు అత్యవసర అనుమతి

బొగ్గుగనుల తవ్వకానికి ‘అత్యవసరం’ అంటూ 873 ఎకరాల భూసేకరణకు సింగరేణి సంస్థకు అనుమతినిస్తూ ఇంధనశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. జయశంకర్‌ జిల్లా ఘన్‌పూర్‌ మండలం ధర్మారావుపేట,

Published : 05 Dec 2021 05:23 IST

సింగరేణి కోసం ఇంధనశాఖ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: బొగ్గుగనుల తవ్వకానికి ‘అత్యవసరం’ అంటూ 873 ఎకరాల భూసేకరణకు సింగరేణి సంస్థకు అనుమతినిస్తూ ఇంధనశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. జయశంకర్‌ జిల్లా ఘన్‌పూర్‌ మండలం ధర్మారావుపేట, కొండాపూర్‌లలో, భూపాలపల్లి మండలం పెద్దాపూర్‌ గ్రామాలలో   ప్రత్యేకంగా భూములు సేకరించేందుకు అనుమతినిచ్చినట్లు తెలిపింది. ఈ రూపేణా ఏటా 10లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగరేణి సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. వీటికి సమీపంలోని కాకతీయ థర్మల్‌ విద్యుత్కేంద్రానికి బొగ్గు సరఫరా చేయాల్సి ఉన్నందున ఈ భూముల సేకరణ అత్యవసరమని వివరించింది. ఈ నేపథ్యంలో భూ సేకరణ చట్టం పరిధిలోని సామాజిక అధ్యయనం నుంచి ప్రక్రియకు మినహాయింపునిచ్చినట్లు సర్కారు పేర్కొంది. అత్యవసరంగా భూములు సేకరించేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని