సాగు విస్తరణలో సరికొత్త మార్గాలు

స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. సాగులో ఎక్కడ ఏ కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా వెంటనే విస్తృత ప్రచారం పొందుతోంది. అలానే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే క్షేత్రస్థాయిలో

Published : 05 Dec 2021 05:35 IST

స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. సాగులో ఎక్కడ ఏ కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా వెంటనే విస్తృత ప్రచారం పొందుతోంది. అలానే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే క్షేత్రస్థాయిలో రైతాంగం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిజ్ఞానాన్ని రైతాంగానికి సమయానుకూలంగా చేరవేయడంలో దేశంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అవిరామంగా కృషి చేస్తున్నాయి. కొన్నేళ్ల కిందట వరకు విస్తరణ సంస్థలన్నీ సంప్రదాయ విస్తరణ పద్ధతులను అనుసరించేవి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విస్తరణ సేవలు, వాటి వినియోగంలో అనేక మార్పులు వస్తున్నాయి. సంప్రదాయ పద్ధతులతో పాటు వ్యవసాయ విస్తరణ సేవల్లో వస్తున్న నూతన పోకడలను మేళవించి సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన సమయంలో  అందిస్తే రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తారు. నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తూ.. తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే వీలుంటుంది. ఇటీవల కాలంలో విస్తృతంగా వాడకంలోకి వచ్చిన వాట్సప్‌, యూట్యూబ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వెబ్‌ అప్లికేషన్లు, టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా రైతులకు కావాల్సిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు, అధికారులు చేరవేస్తున్నారు. రైతులు కూడా సాగులో ఎదురైన సమస్యలను ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని పరిష్కరించుకొంటున్నారు. ఇలాంటి సందర్భంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని సాగులో ఎలా రాణించాలి? అందుబాటులో ఉన్న సాంకేతికతను పొందాలంటే ఎలాంటి మాధ్యమాలను వాడాలి? సాగు సమాచారాన్ని అందించే వెబ్‌సైట్లు ఏమున్నాయి? వీటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అధిక దిగుబడుల సాధనలో సామాజిక మాధ్యమాలు ఏ విధంగా తోడ్పడుతున్నాయి? వగైరా విషయాలను డిసెంబరు ‘అన్నదాత’ మీకు అందిస్తోంది. మరెన్నో ఆసక్తికర కథనాలు అన్నదాత డిసెంబరు-2021 సంచికలో...

‘అన్నదాత’ చందాదారులుగా చేరడానికి సంప్రదించాల్సిన ఫోన్‌ నెం: 9121157979, 8008522248  (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని