విదేశీ ప్రయాణికుల్లో పాజిటివ్‌ కేసుల్లేవ్‌

ఒమిక్రాన్‌ ముప్పు ఉన్న దేశాల నుంచి శనివారం శంషాబాద్‌ విమానాశ్రయం మీదుగా రాష్ట్రానికి వచ్చిన 70 మందిలో ఎవరికీ పాజిటివ్‌ రాలేదని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. వివిధ దేశాల

Published : 05 Dec 2021 05:35 IST

వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌ -న్యూస్‌టుడే బృందం: ఒమిక్రాన్‌ ముప్పు ఉన్న దేశాల నుంచి శనివారం శంషాబాద్‌ విమానాశ్రయం మీదుగా రాష్ట్రానికి వచ్చిన 70 మందిలో ఎవరికీ పాజిటివ్‌ రాలేదని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. వివిధ దేశాల నుంచి ఇప్పటివరకు 979 మంది వచ్చినట్లు గుర్తించగా.. వారిలో 13 మందికి పాజిటివ్‌ ఉందని, వీరి నమూనాలను ఇప్పటికే జీనోమ్‌ సీక్వెన్స్‌కు పంపించినట్లు తెలిపింది. ఈ నివేదికల ఫలితాలు అందాల్సి ఉందని పేర్కొంది.

దిల్లీ నుంచి వచ్చిన కుటుంబానికి కరోనా
గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని పీరంచెరువులోని ఒక అపార్టుమెంటులో ఉంటున్న ఓ కుటుంబంలోని నలుగురికి శనివారం కరోనాగా నిర్ధారణ అయింది. మూడు రోజుల కిందట వీరు దిల్లీ నుంచి నగరానికి వచ్చారు. ఇదే అపార్టుమెంటులో మరో ఆరుగురికి వైరస్‌ సోకింది. మెదక్‌ జిల్లా హవేలి ఘనపూర్‌లోని ఫులే బాలికల గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులకు శనివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తూప్రాన్‌ మండలం హైదర్‌గూడ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి, ఆమె ఇద్దరు కుమారులకు పాజిటివ్‌గా తేలింది.

కొత్తగా 213 కొవిడ్‌ కేసులు
రాష్ట్రవ్యాప్తంగా శనివారం 213 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. రాష్ట్రంలో శనివారం 39,495 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీలో 72 మందికి, రంగారెడ్డి జిల్లా 21, సంగారెడ్డి జిల్లాలో 20 మందికి పాజిటివ్‌ వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని