Published : 06 Dec 2021 07:31 IST

TS News: ‘మాస్క్‌’ ఉల్లంఘనులపై రూ.131 కోట్ల జరిమానాలు

ఈనాడు, హైదరాబాద్‌: మాస్క్‌ నిబంధనను ఉల్లఘించినవారిపై ఈ-పెట్టీ కేసు నమోదు చేయడంపై పోలీసులు దృష్టి సారించారు. గత ఏడాది మార్చి ఆఖరులో లాక్‌డౌన్‌ అమలైనప్పటి నుంచే మాస్క్‌ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న వారిపై కేసుల నమోదుకు శ్రీకారం చుట్టారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌లోని 51 సెక్షన్‌ కింద కేసుల నమోదు ఆరంభించారు. గత ఏడాది 3,26,758 కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది 9,89,340 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం రూ.13,16,098 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే ఈ ఏడాది ఇప్పటివరకు 1,08,736 కేసులు నమోదు చేశారు. ఈ తరహా ఉల్లంఘనకు రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తున్న విషయం విదితమే. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా జరిమానా విధించిన మొత్తం రూ.131 కోట్లు కావడం గమనార్హం. కొంతకాలంగా ఈ అంశంపై ఉదారంగా వ్యవహరించిన పోలీసులు ఒమిక్రాన్‌ అలజడి నేపథ్యంలో మరోసారి అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ మాస్క్‌ లేకుండా దొరికినవారిపై ఈ-పెట్టీ కేసు నమోదు చేస్తున్నారు. తమ వద్ద ఉన్న ట్యాబ్‌ల నుంచి అప్పటికప్పుడు చరవాణికి సంక్షిప్త సందేశం పంపిస్తున్నారు. న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసి, హాజరు పరుస్తున్నారు. గతంలో కేసులు నమోదైన వారిలో పలువురిని ఇప్పటికే న్యాయస్థానాల్లో హాజరుపరచగా.. మిగిలిన వారిపైనా తాజాగా దృష్టి సారించారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని