టైటిల్‌ గ్యారంటీ చట్టం తీసుకురండి

తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేయడంతోపాటు టైటిల్‌ గ్యారంటీ చట్టం తీసుకువచ్చి రైతులకు భూమి హక్కు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీసీ ధరణి కమిటీ కోరింది. ధరణిలో

Published : 06 Dec 2021 05:22 IST

- హరీశ్‌రావుకు పీసీసీ ధరణి కమిటీ లేఖ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేయడంతోపాటు టైటిల్‌ గ్యారంటీ చట్టం తీసుకువచ్చి రైతులకు భూమి హక్కు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీసీ ధరణి కమిటీ కోరింది. ధరణిలో సమస్యల పరిష్కారానికి కొన్ని సూచనలు చేస్తూ ఆదివారం మంత్రి హరీశ్‌రావుకు ఆ కమిటీ లేఖ రాసింది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డుల సవరణ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో లక్షల మంది రైతులు కొత్త పుస్తకాల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని లేఖలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని