
Published : 06 Dec 2021 05:22 IST
‘ఎల్ఐసీలో వాటాల విక్రయాన్ని ఉపసంహరించుకోవాలి’
ఈనాడు, హైదరాబాద్: జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)లో వాటాల విక్రయాన్ని ఉపసంహరించుకోవాలని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం(ఏఐఐఈఏ) జోనల్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 70 శాతానికి పెంచడాన్ని ఉపసంహరించుకోవాలని, బీమా ప్రీమియంపై జీఎస్టీని తొలగించాలని కోరారు.
Tags :