శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షలు

శ్రీచైతన్య - ఇన్ఫినిటీ లెర్న్‌ దేశంలోనే అతిపెద్ద స్కాలర్‌షిప్‌ పరీక్షకు శ్రీకారం చుట్టినట్లు ప్రకటించింది. కార్యక్రమ డైరెక్టర్‌ సుష్మ బొప్పన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

Published : 06 Dec 2021 05:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీచైతన్య - ఇన్ఫినిటీ లెర్న్‌ దేశంలోనే అతిపెద్ద స్కాలర్‌షిప్‌ పరీక్షకు శ్రీకారం చుట్టినట్లు ప్రకటించింది. కార్యక్రమ డైరెక్టర్‌ సుష్మ బొప్పన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 18, 19 తేదీల్లో ఆన్‌లైన్‌లో, 19 వ తేదీన ఆఫ్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు 3 నుంచి 12వ తరగతుల్లో చేరవచ్చని తెలిపారు. దాదాపు రూ.వెయ్యి కోట్ల ఫీజు రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. పాల్గొనాలనుకునే వారు ఆన్‌లైన్‌లో www.infinitylearn.com/score లో రూ.125 ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఫైనల్‌ పరీక్ష శ్రీ చైతన్య క్యాంపస్‌లలో ఆన్‌లైన్‌లో జరుగుతుందన్నారు. వివరాల కోసం www.infinitylearn.com/score లేదా 040-71045046 నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని