Published : 06/12/2021 05:22 IST

వీఆర్వోలపై నిర్లక్ష్య వైఖరి వీడాలి

గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

సమావేశంలో మాట్లాడుతున్న గోల్కొండ సతీష్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘రాష్ట్రంలో వీఆర్వోల పరిస్థితి దారుణంగా ఉంది. 5,485 మంది 15 నెలలుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి’’ అని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పేర్కొంది. ఆదివారమిక్కడ జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీష్‌, ప్రధాన కార్యదర్శి పల్లెపాటి నరేష్‌ మాట్లాడుతూ.. ‘‘వీఆర్వో వ్యవస్థ రద్దుకు ముందుతో పోల్చితే ఇప్పుడే ఎక్కువ పనిభారాన్ని మోస్తున్నాం. జాబ్‌ ఛార్టు లేదు. శాఖలో ఆర్‌ఐ, సీనియర్‌ అసిస్టెంట్ల నుంచి డిప్యూటీ కలెక్టర్ల వరకు పదోన్నతులు లేవు. వీఆర్‌ఏలకూ పదోన్నతులు నిలిచిపోయాయి. జోనల్‌ వ్యవస్థలో ఐచ్ఛికాలు కల్పించి వీఆర్వో పోస్టు లేదా సమానమైన హోదా ఉన్న స్థానాలను కేటాయించి వీఆర్వోల బదిలీలు చేపట్టాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ తప్పదు’’ అని పేర్కొన్నారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని