కరోనా వ్యాప్తిపై పరిశోధన సంస్థల నిఘా

కొవిడ్‌ కేసులు పెరుగుతుండడం, ఒమిక్రాన్‌ రకం వైరస్‌ దేశంలో వెలుగుచూస్తుండడంతో పరిశోధన సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఏరకం వైరస్‌ ప్రస్తుతం వ్యాప్తిలో ఉందనేది

Published : 06 Dec 2021 05:22 IST

మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షించనున్న సీసీఎంబీ, ఐఐసీటీ

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ కేసులు పెరుగుతుండడం, ఒమిక్రాన్‌ రకం వైరస్‌ దేశంలో వెలుగుచూస్తుండడంతో పరిశోధన సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఏరకం వైరస్‌ ప్రస్తుతం వ్యాప్తిలో ఉందనేది తెలుసుకునేందుకు జన్యుక్రమాన్ని ఆవిష్కరిస్తూనే, కొవిడ్‌ వ్యాప్తిని ముందే పసిగట్టేందుకు మురుగునీటి కుంటలు, చెరువుల్లో నమూనాలను సేకరించబోతున్నారు. సీసీఎంబీ, ఐఐసీటీ కలిసి ఈ పని చేయబోతున్నాయి. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని నగరాల్లో సర్వేలెన్స్‌ చేపట్టబోతున్నట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌కుమార్‌ నందికూరి ‘ఈనాడు’కు తెలిపారు.

ముందే తెలుసుకోవచ్చు..: మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షించడం ద్వారా కొవిడ్‌తో పాటు ఇతర మహమ్మారులను, అంటువ్యాధులను ముందే గుర్తించడానికి, వ్యాప్తిని తగ్గించడానికి, నివారించడానికి వీలవుతుంది. గతంలో పోలియో సమూల నిర్మూలనకు ఈ పద్ధతిని అనుసరించారు. ఇదే పంథాని కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలోనూ అనుసరించారు. వ్యాధి తగ్గుముఖం పట్టడం, నిధుల సమస్య తలెత్తడంతో ఆగస్టు తర్వాత నిలిపేశారు. ఇటీవల కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో నమూనాల సేకరణ తిరిగి చేపట్టాలని, ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరినట్లు కొద్దిరోజుల క్రితం పరిశోధకులు తెలిపారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో మళ్లీ మొదలు పెడుతున్నట్లు తాజాగా చెప్పారు. వ్యక్తిగతంగా అందరికీ పరీక్షలు చేయడం క్లిష్టమైన దశలో మురుగునీటిపై నిఘా చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని