పేలని తుపాకి.. ఆగిన పరుగు

పోలీసుల చేతిలో తుపాకులు కొన్నిసార్లు మిస్‌ఫైర్‌ అవుతుంటాయి. మరికొన్నిసార్లు అవసరమైన సందర్భాల్లోనూ పేలకుండా మొరాయిస్తుంటాయి. రాచకొండ కమిషనరేట్‌ పోలీసు క్రీడోత్సవాల ప్రారంభానికి హోంశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రవిగుప్తా (ఐపీఎస్‌) మంగళవారం సరూర్‌నగర్‌ స్టేడియానికి వచ్చారు.

Published : 08 Dec 2021 05:22 IST

పోలీసుల చేతిలో తుపాకులు కొన్నిసార్లు మిస్‌ఫైర్‌ అవుతుంటాయి. మరికొన్నిసార్లు అవసరమైన సందర్భాల్లోనూ పేలకుండా మొరాయిస్తుంటాయి. రాచకొండ కమిషనరేట్‌ పోలీసు క్రీడోత్సవాల ప్రారంభానికి హోంశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రవిగుప్తా (ఐపీఎస్‌) మంగళవారం సరూర్‌నగర్‌ స్టేడియానికి వచ్చారు. 100 మీటర్ల పరుగు పందెం ప్రారంభానికి తనకు అందించిన రివాల్వర్‌ ట్రిగ్గర్‌ నొక్కారు. అది పేలకపోవటంతో కొందరు క్రీడాకారులు ఆగిపోగా.. మరికొందరు ట్రిగ్గర్‌ నొక్కిన శబ్దం రాగానే పరుగు ప్రారంభించారు. దీంతో దాన్ని పౌల్‌ స్టార్ట్‌గా అధికారులు ప్రకటించి నిలిపివేశారు. అనంతరం రవిగుప్తా మరో రివాల్వర్‌ తీసుకొని ట్రిగ్గర్‌ నొక్కి పరుగు పందేన్ని ప్రారంభించారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని