తెలుగు వర్సిటీ ‘2018-ప్రతిభా పురస్కారాలు’

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 12 మంది ప్రముఖులను ప్రతిష్ఠాత్మక ‘ప్రతిభా పురస్కారాల’తో సత్కరిస్తోంది

Published : 08 Dec 2021 05:35 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 12 మంది ప్రముఖులను ప్రతిష్ఠాత్మక ‘ప్రతిభా పురస్కారాల’తో సత్కరిస్తోంది. 2018 సంవత్సరానికి మంగళవారం ఈ అవార్డులు ప్రకటించింది. ‘రామకవచం వెంకటేశ్వర్లు(కవిత), ఆచార్య వెలుదండ నిత్యానందరావు(విమర్శ), డి.అనంతయ్య(చిత్రలేఖనం), ఆర్‌.గంగాధర్‌(శిల్పం), ఓలేటి రంగమణి(నృత్యం), డా.ఎస్‌.కె.వెంకటాచార్యులు(సంగీతం), కల్లూరి భాస్కరం(పత్రికారంగం), రావుల వెంకట్రాజంగౌడ్‌(నాటకం), కౌళ్ల తలారి బాలయ్య(జానపద కళారంగం), డా.మలుగ అంజయ్య(అవధానం), ఎన్‌.అరుణ(ఉత్తమ రచయిత్రి), పి.చంద్రశేఖర్‌ ఆజాద్‌(నవల) పురస్కారాలకు ఎంపికయ్యారని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని