భారీగా మిరప ధర తగ్గింపు

వ్యాపారులు ఇష్టారాజ్యంగా మిరప ధరలు తగ్గించారని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు మంగళవారం ఆగ్రహించారు. మార్కెట్‌ గేట్లకు తాళం వేసి ఆందోళన చేపట్టారు

Published : 08 Dec 2021 05:45 IST

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: వ్యాపారులు ఇష్టారాజ్యంగా మిరప ధరలు తగ్గించారని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు మంగళవారం ఆగ్రహించారు. మార్కెట్‌ గేట్లకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. దీంతో కొనుగోళ్లు నిలచిపోయాయి. సోమవారం ఏసీ మిరప క్వింటాకు రూ.19 వేలు పాడారు. ఆ రోజు 108 నమూనాలు వచ్చాయి. ధర బాగుందని రైతులు శీతలగిడ్డంగుల్లో నిల్వ చేసిన 800 నమూనాలను మంగళవారం మార్కెట్‌కు తీసుకొచ్చారు. ధర రూ.16 వేలకు పాడటంతో రైతులు మండిపడ్డారు. ఒక్కరోజులోనే రూ.3 వేలు తగ్గిస్తారా అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని