95 శాతం ఫార్మా సీట్ల భర్తీ

ఎంసెట్‌ అగ్రికల్చర్‌ రాసిన విద్యార్థులకు తొలి విడత కౌన్సెలింగ్‌లో బీఫార్మసీ, ఫార్మా డి సీట్లను మంగళవారం కేటాయించారు. మొత్తం 8,807 సీట్లుండగా అందులో 8,394(95.31 శాతం) భర్తీ అయ్యాయి.

Published : 08 Dec 2021 05:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ అగ్రికల్చర్‌ రాసిన విద్యార్థులకు తొలి విడత కౌన్సెలింగ్‌లో బీఫార్మసీ, ఫార్మా డి సీట్లను మంగళవారం కేటాయించారు. మొత్తం 8,807 సీట్లుండగా అందులో 8,394(95.31 శాతం) భర్తీ అయ్యాయి. బీఫార్మసీలో 7,562 సీట్లకు 7,162, ఫార్మా డిలో 1183కి 1170 సీట్లు నిండాయి. 413 సీట్లే మిగిలాయి. మొత్తం 120 కళాశాలల్లో 43 చోట్ల సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సీట్లు పొందినవారు ఈ నెల 10 లోపు ఫీజు చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌మిత్తల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని