TS News: కిమ్స్‌లో ‘బ్రీతింగ్‌ లంగ్‌’ మార్పిడి శస్త్రచికిత్స

దేశంలోనే తొలిసారిగా బ్రీతింగ్‌ లంగ్‌ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. హార్ట్‌, లంగ్‌ యంత్రాన్ని వినియోగించకుండా ఓ ఊపిరితిత్తితో సమన్వయం

Updated : 13 Dec 2021 09:23 IST

దేశంలో తొలిసారి అన్న వైద్యులు

శస్త్రచికిత్స చేస్తున్న డాక్టర్లు

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: దేశంలోనే తొలిసారిగా బ్రీతింగ్‌ లంగ్‌ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. హార్ట్‌, లంగ్‌ యంత్రాన్ని వినియోగించకుండా ఓ ఊపిరితిత్తితో సమన్వయం చేసుకుంటూ మరో ఊపిరితిత్తి పనిచేస్తుండగానే మార్చడం ఈ శస్త్రచికిత్స ప్రత్యేకతని.. విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ విధానాన్ని తొలిసారి ఇక్కడ చేపట్టి విజయవంత చేసినట్లు ఆసుపత్రి ఊపిరితిత్తుల మార్పిడి విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ సందీప్‌ ఆదివారమిక్కడ వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టులో ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఓ మధ్య వయస్కుడికి మార్పిడి ఆపరేషన్‌ చేసేందుకు వీలుగా ఈ పద్ధతిని ఎంచుకున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని