TS News: మరింత పెరగనున్న చలి

చలికి ఇక వణకక తప్పదు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత బాగా పెరగనుందని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా సిర్పూర్‌(కుమురంభీం జిల్లా)లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Updated : 14 Dec 2021 08:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: చలికి ఇక వణకక తప్పదు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత బాగా పెరగనుందని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా సిర్పూర్‌(కుమురంభీం జిల్లా)లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రోజుల్లో 8 నుంచి 10 డిగ్రీలే ఉంటుందని అంచనా. ఈ శీతాకాలంలో ఇంతవరకూ చలి తీవ్రత పెద్దగా లేదు. ప్రస్తుతం ఈశాన్య, వాయవ్య భారత్‌ నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే ఐదురోజుల పాటు రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుంది. రాత్రిపూట భూవాతావరణం త్వరగా చల్లబడి చలి పెరుగుతుంది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 25 శాతం వరకూ అదనంగా పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని