TS News:39 కోట్ల బీర్లు.. 44 కోట్ల సీసాలు

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టిస్తున్నాయి. 2020లో కొవిడ్‌ ఆంక్షల దృష్ట్యా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మందకొడిగా సాగిన అమ్మకాలు 2021లో మాత్రం దూసుకెళ్లాయి. గత అయిదు రోజుల్లోనే రూ.902

Updated : 01 Jan 2022 09:32 IST

ఏడాదంతా రూ.30,196 కోట్లు.. 5 రోజుల్లో రూ.902 కోట్ల అమ్మకాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టిస్తున్నాయి. 2020లో కొవిడ్‌ ఆంక్షల దృష్ట్యా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మందకొడిగా సాగిన అమ్మకాలు 2021లో మాత్రం దూసుకెళ్లాయి. గత అయిదు రోజుల్లోనే రూ.902 కోట్లకుపైగా విక్రయాలు జరిగాయి. డిసెంబరు నెల విక్రయాల్లోనూ అత్యధికం నమోదైంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏకంగా రూ.3,435 కోట్లకు(2020 డిసెంబరులో రూ.2764 కోట్లు) చేరాయి. డిసెంబరు 27న 202.42 కోట్లు, 28న 155.48 కోట్లు, 29న రూ.149.53, 30న రూ.246.56 కోట్లు, 31న రాత్రి 7 గంటల వరకు రూ.148.52 కోట్ల అమ్మకాలు సాగాయి. 2020లో రూ.25,601.39 కోట్ల అమ్మకాలు జరగ్గా, 2021లో శుక్రవారం సాయంత్రానికే రూ.30,196 కోట్ల మేర నమోదయ్యాయి. మొత్తంగా ఏడాదంతా 3,68,68,975 కేసుల లిక్కర్‌, 3,25,82,859 కేసుల బీర్లు అమ్ముడైనట్టు ఎక్సైజ్‌ శాఖ లెక్క తేల్చింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.6,979 కోట్లు, నల్గొండ రూ.3,288 కోట్లు, హైదరాబాద్‌ రూ.3,201 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని