TS News: ‘పది’ పరీక్షల ఫీజు తేదీలు ఖరారు..మే నెలాఖరులో పరీక్షలు!

పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజులు చెల్లించే తేదీలను ప్రభుత్వం పరీక్షల విభాగం ఖరారు చేసింది. పరీక్ష ఫీజు రూ.125గా నిర్ణయించింది. ఈ నెల 29వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా చెల్లించవచ్చు.

Updated : 08 Jan 2022 07:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజులు చెల్లించే తేదీలను ప్రభుత్వం పరీక్షల విభాగం ఖరారు చేసింది. పరీక్ష ఫీజు రూ.125గా నిర్ణయించింది. ఈ నెల 29వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 10, రూ.200 అదనంతో ఫిబ్రవరి 21, రూ.500 అదనంతో మార్చి 3వ తేదీ వరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆ ప్రకారం మే 20వ తేదీ తర్వాత మొదలవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని