శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు వైభవంగా కొనసాగాయి. శుక్రవారం ద్వాదశి సందర్భంగా శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం, సర్వదర్శనం టోకెన్‌లు కలిగిన భక్తులకు మహాలఘు దర్శనం కల్పించారు

Published : 15 Jan 2022 05:44 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు వైభవంగా కొనసాగాయి. శుక్రవారం ద్వాదశి సందర్భంగా శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం, సర్వదర్శనం టోకెన్‌లు కలిగిన భక్తులకు మహాలఘు దర్శనం కల్పించారు. ఉదయం శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్‌ను శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరాహస్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో స్నపన తిరుమంజనం, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్లకు చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు. కొవిడ్‌ నేపథ్యంలో చక్రస్నానం ఏకాంతంగా నిర్వహించారు.
* శ్రీవారి వైకుంఠ ద్వారదర్శనం శనివారం కూడా కొనసాగుతుంది. ఈ నెల 22వ తేదీ వరకు భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకోవచ్చు. తిరుమలకు నేరుగా వచ్చిన భక్తులు కరెంట్‌ బుకింగ్‌లో గదులను పొందే ఏర్పాట్లను తితిదే చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని