పాఠశాల విద్యాశాఖలో భోగి రోజూ సెలవు కరవు

 కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయుల కేటాయింపు, పోస్టింగులు, తప్పుల సవరణ తదితర పనులతో పాఠశాల విద్యాశాఖ అధికారులకు 40 రోజులుగా సెలవులు కరవయ్యాయి.

Updated : 15 Jan 2022 06:34 IST

40 రోజులుగా అర్ధరాత్రి వరకు విధులు

ఈనాడు, హైదరాబాద్‌:  కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయుల కేటాయింపు, పోస్టింగులు, తప్పుల సవరణ తదితర పనులతో పాఠశాల విద్యాశాఖ అధికారులకు 40 రోజులుగా సెలవులు కరవయ్యాయి. రెండో శనివారం, ఆదివారాలు కూడా ఇప్పటివరకు అధికారులు పనిచేశారు. కొన్ని సార్లు తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా కార్యాలయంలోనే ఉన్నారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని అధికారులు శుక్రవారం (భోగి పండుగ) నాడు కూడా కార్యాలయానికి వచ్చి రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహించారు. గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు పోస్టింగులు ఇవ్వడంపై విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన అధికారులతో శుక్రవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఒక అధికారి అనారోగ్యంతో సెలవు పెట్టారు. సంక్రాంతి రోజు శనివారం కూడా వారికి సెలవు లేనట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని