తిరుపతిలో దిగకుండా వెనక్కి వచ్చిన స్పైస్‌ జెట్‌

ప్రతికూల వాతావరణం కారణంగా ఓ విమానం మూడు గంటల తర్వాత శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెనక్కు తిరిగి వచ్చింది. విమానాశ్రయం అధికారులు తెలిపిన  వివరాల ప్రకారం.. స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ ఎస్‌జీ-1075 విమానం ప్రయాణికులతో

Published : 15 Jan 2022 06:08 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ప్రతికూల వాతావరణం కారణంగా ఓ విమానం మూడు గంటల తర్వాత శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెనక్కు తిరిగి వచ్చింది. విమానాశ్రయం అధికారులు తెలిపిన  వివరాల ప్రకారం.. స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ ఎస్‌జీ-1075 విమానం ప్రయాణికులతో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు తిరుపతికి బయలుదేరింది. అక్కడ దట్టమైన పొగ మంచు అలముకోవడంతో స్థానిక ఏటీసీ అధికారులు విమానం దిగడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఉదయం 9.30 గంటలకు తిరిగి శంషాబాద్‌కు వచ్చింది. పొగమంచు తగ్గినట్లు తిరుపతి ఏటీసీ నుంచి సమాచారం అందగానే 45 నిమిషాల తర్వాత అంటే 10.15 గంటలకు ఆ విమానం తిరిగి వెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని