కాలువలు, ఖాళీ స్థలాల్లోని వ్యర్థాల తొలగింపు

మిర్యాలగూడ పట్టణం: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్‌ ప్రధాన మురుగు కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. కాలువలోని వ్యర్థాలతో దుర్వాసన వస్తోందంటూ

Published : 15 Jan 2022 06:08 IST

‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, సూర్యాపేట-న్యూస్‌టుడే, మిర్యాలగూడ పట్టణం: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్‌ ప్రధాన మురుగు కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. కాలువలోని వ్యర్థాలతో దుర్వాసన వస్తోందంటూ శుక్రవారం ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ‘ఎక్కడి చెత్త అక్కడే’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన సూర్యాపేట మున్సిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి సిబ్బందిని పంపి పొక్లెయిన్‌తో కాలువను శుభ్రం చేయించారు. మరోవైపు నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని 26వ వార్డులో ఖాళీ స్థలంలో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను మున్సిపల్‌ కమిషనరు రవీందర్‌సాగర్‌ ఆదేశాలతో సిబ్బంది తొలగించారు.

పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు: పురపాలక శాఖ
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చినట్లు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా, సీజనల్‌ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు