ఏపీలో 4,528 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఉదయం 9నుంచి శుక్రవారం ఉదయం 9గంటల మధ్య 39,816 నమూనాలను పరీక్షించగా, 4,528 కేసులు నమోదయ్యాయి. జనవరి ఒకటిన పాజిటివిటీ 0.57%గా ఉంది.

Published : 15 Jan 2022 06:17 IST

చిత్తూరు జిల్లాలో అత్యధికం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఉదయం 9నుంచి శుక్రవారం ఉదయం 9గంటల మధ్య 39,816 నమూనాలను పరీక్షించగా, 4,528 కేసులు నమోదయ్యాయి. జనవరి ఒకటిన పాజిటివిటీ 0.57%గా ఉంది. 2వారాల వ్యవధిలో అదనంగా 10.8% పెరిగి 11.37శాతానికి పెరిగింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,027 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు ఎక్కువగా తిరుపతిలోనే వస్తున్నాయి. అక్కడ ఇటీవల జాతీయస్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. క్రీడాకారులు, పోటీల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది పలువురు కరోనా బారినపడ్డారు. దీనికితోడు యాత్రికుల రద్దీ ఉన్నందున వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. చిత్తూరు జిల్లా తర్వాత విశాఖ జిల్లాలో 992 కేసులు రికార్డయ్యాయి. ప్రకాశం జిల్లాలో కొవిడ్‌తో ఒకరు ప్రాణాలు విడిచారు.
బీ ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని