17నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ తరగతులను ఈ నెల 17 నుంచి 22 వరకూ(తొలిదశలో) ఆన్‌లైన్‌లో నిర్వహించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు, నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్‌ ఎక్స్‌టర్నల్‌ పరీక్షలను థియరీ పరీక్షల తర్వాత నిర్వహించనుంది

Published : 15 Jan 2022 06:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ తరగతులను ఈ నెల 17 నుంచి 22 వరకూ(తొలిదశలో) ఆన్‌లైన్‌లో నిర్వహించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు, నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్‌ ఎక్స్‌టర్నల్‌ పరీక్షలను థియరీ పరీక్షల తర్వాత నిర్వహించనుంది. మూడు, నాలుగు ఏడాది చదివే విద్యార్థులకు మిడ్‌టర్మ్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో నిర్వహించుకునేలా కళాశాలలకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు జేఎన్‌టీయూ ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. కళాశాలలకు ఆన్‌లైన్‌ తరగతులకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఫ్యాకల్టీని యాజమాన్యాలు యథావిధిగా కొనసాగించాలని, విధుల నుంచి తొలగిస్తే ఆందోళనకు దిగుతామని తెలంగాణ సాంకేతిక, ప్రొఫెషనల్‌ కళాశాలల ఉద్యోగుల సంఘం వి.బాలకృష్ణారెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని