‘నైబర్‌హుడ్‌ ఛాలెంజ్‌’లో వరంగల్‌కు స్థానం

జాతీయ స్థాయిలో గ్రేటర్‌ వరంగల్‌కు గుర్తింపు లభించింది. నర్చరింగ్‌ నైబర్‌హుడ్‌ ఛాలెంజ్‌ (ఎన్‌ఎన్‌సీ) పోటీలో దేశంలోని టాప్‌-10 నగరాల్లో ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా మాతా, శిశు సంరక్షణ, సంరక్షకులకు

Updated : 18 Jan 2022 04:12 IST

వరంగల్‌లోని బాలసముద్రం అంగన్‌వాడీ కేంద్రానికి హంగులు

కార్పొరేషన్‌(వరంగల్‌), న్యూస్‌టుడే: జాతీయ స్థాయిలో గ్రేటర్‌ వరంగల్‌కు గుర్తింపు లభించింది. నర్చరింగ్‌ నైబర్‌హుడ్‌ ఛాలెంజ్‌ (ఎన్‌ఎన్‌సీ) పోటీలో దేశంలోని టాప్‌-10 నగరాల్లో ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా మాతా, శిశు సంరక్షణ, సంరక్షకులకు మౌలిక సదుపాయాలు, పిల్లలను ఆహ్లాదపరిచే పార్కు, ఆటస్థలం, క్రీడాసామగ్రి తదితరాలు సమకూర్చిన నగరాల నుంచి కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ 2020, నవంబరులో దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 63 నగరాలు దరఖాస్తులను పంపించగా.. గతంలో మొదటి విడతలో 25 నగరాలను ఎంపిక చేసింది. దిల్లీలో సోమవారం రెండో విడతలో టాప్‌-10 నగరాల జాబితాను ప్రకటించింది. బెంగళూర్‌, హుబ్బళ్లి, ఇండోర్‌, కాకినాడ, జైపుర్‌, కొచ్చి, కొహిమ, రవుర్కెలా, వడోదరా, వరంగల్‌ మొదటి 10 నగరాల జాబితాలో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని