సాయం చేస్తాం.. ధైర్యంగా ఉండండి

వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వ  సాయం అందుతుందని వ్యవసాయశాఖ మంత్రి  నిరంజన్‌రెడ్డి తెలిపారు. పరకాల, నర్సంపేట, మంథని ప్రాంతాల్లోని

Published : 19 Jan 2022 03:36 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రులు

పరకాల మండలం నారక్కపేటలో ఆదుకోవాలని మంత్రుల కాళ్లపై పడి వేడుకుంటున్న మహిళా రైతు

ఈనాడు, వరంగల్‌; నర్సంపేట, న్యూస్‌టుడే: వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వ  సాయం అందుతుందని వ్యవసాయశాఖ మంత్రి  నిరంజన్‌రెడ్డి తెలిపారు. పరకాల, నర్సంపేట, మంథని ప్రాంతాల్లోని మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారని.. క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పడంతో మంత్రి ఎర్రబెల్లి, తాను ఇక్కడకు వచ్చామని వివరించారు. హనుమకొండ, వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో జరిగిన మిరప పంట నష్టాన్ని మంగళవారం వారు పరిశీలించారు. రైతులను పరామర్శించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘రైతులకు నేరుగా పరిహారం ఇవ్వడం సాధ్యం కాదు. జాతీయ విపత్తుగా ప్రకటిస్తే కేంద్ర బృందాలు మూడు,నాలుగు నెలలకు వస్తాయి. అప్పుడు నష్టం అంచనా వేయలేని పరిస్థితి. అందుకని ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక సాయం అందజేస్తాం’’ అని వివరించారు. మంత్రుల పర్యటనలో పలువురు రైతులు  గోడు వెళ్లబోసుకుంటూ ఆదుకోవాలని ప్రాధేయపడ్డారు.వరంగల్‌ జిల్లా నర్సంపేటలో మంత్రుల పర్యటన రైతుల నిరసన మధ్య సాగింది. ఇప్పల్‌తండా శివారు హనుమాన్‌తండాలో మంత్రి నిరంజన్‌రెడ్డి పొలంలోనే కూర్చొని  ప్రసంగిస్తుండగా పలువురు రైతులు ఆందోళనకు దిగారు. పర్యటనలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి,  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని