కోతుల పంటే పండింది

ఒక్క కోతి చాలంటారు.. ఊరంతా పీకి పందిరేసేందుకు.. అలాంటిది గుంపులు గుంపులుగా అవి దండెత్తి వస్తే తట్టుకోవటం బహు కష్టమే.. సూర్యాపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వానరాల బెడద

Published : 19 Jan 2022 03:51 IST

ఉలవ పంటను పాడుచేస్తున్న వానర మూక

ఒక్క కోతి చాలంటారు.. ఊరంతా పీకి పందిరేసేందుకు.. అలాంటిది గుంపులు గుంపులుగా అవి దండెత్తి వస్తే తట్టుకోవటం బహు కష్టమే.. సూర్యాపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వానరాల బెడద తీవ్రమవుతోంది. అదిలించడానికి వెళ్లేవారిపై అవి దాడిచేస్తున్నాయి. చివ్వెంల మండలం వల్లభాపురంలో రెండెకరాల పొలంలో వీరయ్య అనే రైతు ఉలవ పంట వేశారు. గింజలొచ్చే సమయానికి వానరమూక పొలంలో వాలిపోయింది. పంట మొత్తం పాడుచేసింది. వేరుసెనగ లాంటి ఆరుతడి పంటలు సాగుచేస్తే చేతికందే పరిస్థితి ఉండడంలేదని ఉలవ పంట వేసినా.. కోతులు దక్కనీయటం లేదని వీరయ్య వాపోయారు. దాదాపు రూ.50 వేల విలువైన పంట పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

- ఈనాడు, సూర్యాపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని