పూల రెక్కల టీ.. పోషకాల్లో మేటి
కుసుమ నుంచి వంటనూనె మాత్రమే కాదు. ఆ పూల రేకులతో టీ చేసుకుని తాగవచ్చని అంటున్నారు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు. ఈ టీ వల్ల పలు రకాల
కుసుమ పూలతో తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం రూపకల్పన
కుసుమ టీ ప్యాకెట్ - లోపల పూల రెక్కలు
న్యూస్‌టుడే, తాండూరు: కుసుమ నుంచి వంటనూనె మాత్రమే కాదు. ఆ పూల రేకులతో టీ చేసుకుని తాగవచ్చని అంటున్నారు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు. ఈ టీ వల్ల పలు రకాల రుగ్మతలను నివారించవచ్చని చెబుతున్నారు. ‘సాఫో’ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చిన వీరు పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో దశాబ్దకాలంగా యాసంగి సీజన్లో సాగు చేస్తున్న కుసుమ పూలరేకులను సేకరిస్తున్నారు. వీటితో టీ తయారీపై స్థానికులను ప్రోత్సహిస్తున్నారు. వారి నుంచి స్పందన బాగుండడంతో ‘సాఫో టీ’ పేరుతో దీన్ని ప్యాక్ చేసి ప్రయోగాత్మంగా విక్రయిస్తున్నారు. 10 గ్రాముల ప్యాకెట్‌తో 30 కప్పుల వరకు టీ తయారు చేసుకోవచ్చు. టీ పౌడర్‌కు బదులు ఒక కప్పు పాలకు అర చెంచా (సుమారు 0.3 గ్రాములు) కుసుమ పూలరేకులను వేసి మరిగించి తాగితే సరిపోతుంది.
పలు రుగ్మతల నివారణ
కుసుమ పూల టీ తాగితే శరీరానికి అమైనో ఆమ్ల్లాలు, ధాతువులు బి1, బి2, బి12తో పాటు సి, ఇ విటమిన్లు విరివిగా లభిస్తాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. హృద్రోగాలు, కీళ్ల నొప్పులు, వాపులు, మహిళల్లో రుతుక్రమ సమస్యలు నివారించవచ్చు. రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. కానీ ఈ టీని గర్భిణులు తాగడం మంచిది కాదు.
- డాక్టర్ సుధాకర్, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.