రాష్ట్ర నిర్ణయం జాతీయ విద్యా విధానానికి విరుద్ధం: ఏబీవీపీ

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తామనడం జాతీయ నూతన విద్యావిధానానికి  విరుద్ధమని ఏబీవీపీ పేర్కొంది. కనీసం ప్రాథమిక విద్య వరకు అమ్మ

Published : 19 Jan 2022 03:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తామనడం జాతీయ నూతన విద్యావిధానానికి  విరుద్ధమని ఏబీవీపీ పేర్కొంది. కనీసం ప్రాథమిక విద్య వరకు అమ్మ భాషలోనే బోధన ఉండాలని కొత్త విద్యావిధానం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. రూ.7350 కోట్ల పథకం సంగతి తర్వాత.. శౌచాలయాలను శుభ్రం చేసేందుకు స్వచ్ఛ కార్మికులను నియమించాలని తపస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాతు సురేష్‌ ప్రశ్నించారు.

* రాష్ట్రంలో 15 వేల ఉపాధ్యాయ ఖాళీలతోపాటు ఆంగ్ల మాధ్యమం పోస్టులను జూన్‌లోపు భర్తీ చేయాలని రాష్ట్ర డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘాధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి ఓప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

సర్కారు బడులు బలోపేతమవుతాయి: పీఆర్‌టీయూటీఎస్‌

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయంతో సర్కారు బడులు బలోపేతమవుతాయని పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని