శభాష్‌ పోలీస్‌

ఖాకీ దుస్తుల చాటున కరకుదనమే కాదు.. మానవత్వమూ ఉంటుందని చాటారు వరంగల్‌ జిల్లా రాయపర్తి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ బండారి రాజు.. స్పృహ లేకుండా పడివున్న ఓ గుర్తుతెలియని

Published : 19 Jan 2022 03:51 IST

వృద్ధుణ్ని కి.మీ. దూరం భుజాలకెత్తుకుని.. ప్రాణాలు నిలిపిన ఎస్సై

వృద్ధుణ్ని మోసుకొస్తున్న ఎస్సై రాజు

రాయపర్తి, న్యూస్‌టుడే: ఖాకీ దుస్తుల చాటున కరకుదనమే కాదు.. మానవత్వమూ ఉంటుందని చాటారు వరంగల్‌ జిల్లా రాయపర్తి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ బండారి రాజు.. స్పృహ లేకుండా పడివున్న ఓ గుర్తుతెలియని వృద్ధుడి గురించి సమాచారం అందిన వెంటనే స్పందించి, ఆయనను భుజాలపై కిలోమీటరు దూరం మోసుకొచ్చి ప్రాణాలు నిలిపారు. వివరాలు.. మంగళవారం రాయపర్తి మండలం కొండాపూర్‌ పరిధి ఊర చెరువు పక్కన ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడనే సమాచారాన్ని స్థానికులు పోలీసులకు చేరవేశారు. ఎస్సై బండారి రాజు చొక్కా, లుంగీ తీసుకొని అక్కడకు చేరుకున్నారు. వృద్ధుడు నడవలేని స్థితిలో కనిపించారు. కరోనా నేపథ్యంలో ఆయన్ని పట్టుకోవడానికి స్థానికులెవ్వరూ సహకరించలేదు. దీంతో ఎస్సై స్వయంగా ఆయనకు దుస్తులు తొడిగారు. అక్కడి వరకు 108 వాహనం వచ్చే సౌకర్యం లేకపోవడంతో.. సుమారు కిలోమీటరు దూరం వరకు ఆ వృద్ధుణ్ని మోసుకొచ్చారు. ఆపై మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఎస్సై చొరవను మెచ్చుకుంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని