అమెరికా విమానాల రద్దుతో ఇబ్బందులు

5జీ సాంకేతికతతో ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో అమెరికా వెళ్లే విమానాలను ఎయిరిండియా రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బుధవారం దిల్లీ విమానాశ్రయం

Published : 20 Jan 2022 05:29 IST

ఈనాడు, హైదరాబాద్‌, శంషాబాద్‌, న్యూస్‌టుడే: 5జీ సాంకేతికతతో ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో అమెరికా వెళ్లే విమానాలను ఎయిరిండియా రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బుధవారం దిల్లీ విమానాశ్రయం నుంచి అమెరికాలోని వివిధ నగరాలకు వెళ్లాల్సిన 4 విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. ఇది తెలియక హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి దిల్లీ మీదుగా అమెరికా వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విషయం తెలుసుకుని ఆందోళనకు దిగారు. దాదాపు 65 మంది ప్రయాణికులు ఎయిరిండియా తీరుపై నిరసన తెలిపారు. మరోవైపు శుక్రవారం హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా షికాగోకు విమాన సర్వీసు ఉంది. ఆలోగా సమస్య పరిష్కారం కాకపోతే విమానం నడుస్తుందా.. లేదా.. అన్న సందిగ్ధత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని