కుండలు మాయం..అంతటా ప్లాస్టిక్‌ మయం!

కుండల తయారీ వంటి చేతివృత్తులకు ఆదరణ కరవైంది.. అంతటా ప్లాస్టిక్కే రాజ్యమేలుతోంది. గీత కార్మికులు పూర్వం నుంచి తాటి, ఈత కల్లు సేకరణకు కుండలను వాడేవారు. ప్రస్తుతం వీటి తయారీకి కుమ్మరులకు మట్టి దొరకటం లేదు.. వంటచెరకుకు

Published : 20 Jan 2022 05:49 IST

కుండల తయారీ వంటి చేతివృత్తులకు ఆదరణ కరవైంది.. అంతటా ప్లాస్టిక్కే రాజ్యమేలుతోంది. గీత కార్మికులు పూర్వం నుంచి తాటి, ఈత కల్లు సేకరణకు కుండలను వాడేవారు. ప్రస్తుతం వీటి తయారీకి కుమ్మరులకు మట్టి దొరకటం లేదు.. వంటచెరకుకు కొరతతో పాటు అధిక శ్రమ కారణంగా యువత ఈ వృత్తి వైపు ఆసక్తి చూపటం లేదు. ఫలితంగా గీత కార్మికులకు కుండలు లభించక కల్లు సేకరణకు ప్లాస్టిక్‌ సీసాలు వినియోగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల శివారులో కల్లు సేకరణకు తాటిచెట్టుకు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను చిత్రంలో చూడవచ్చు.

- న్యూస్‌టుడే, కోనరావుపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని