పన్నుల వాటాలో రాష్ట్రాలకు డబుల్‌ ధమాకా

రాష్ట్ర ప్రభుత్వాలకు నెలవారీగా చెల్లించే కేంద్ర పన్నుల్లోని వాటాను ఒకేసారి రెండు వాయిదాలు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సాధారణ వాయిదా కింద జనవరి నెలలో రూ.47,541 కోట్లు రావాల్సి ఉండగా, దానికి ముందస్తుగా మరో వాయిదా రూ.47,541 కోట్లు కలిపి

Updated : 21 Jan 2022 05:22 IST

 తెలంగాణకు రూ.1,998 కోట్ల విడుదల
ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,847 కోట్లు

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలకు నెలవారీగా చెల్లించే కేంద్ర పన్నుల్లోని వాటాను ఒకేసారి రెండు వాయిదాలు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సాధారణ వాయిదా కింద జనవరి నెలలో రూ.47,541 కోట్లు రావాల్సి ఉండగా, దానికి ముందస్తుగా మరో వాయిదా రూ.47,541 కోట్లు కలిపి మొత్తం రూ.95,082 కోట్లు విడుదల చేసింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు ఒక్కో వాయిదాకు రూ.1,923.98 కోట్ల చొప్పున రెండు వాయిదాల్లో రూ.3,847.96 కోట్లు, తెలంగాణకు రూ.999.31 కోట్ల చొప్పున రెండు విడతలూ కలిపి రూ.1,998.62 కోట్లు విడుదలయ్యాయి. కొవిడ్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను ఆదుకోవాలని రాష్ట్రాలు కోరడంతో కేంద్ర ప్రభుత్వం తొలిసారి గత నవంబరులో ఇలాగే ఒకసారి ముందస్తు వాయిదా చెల్లించింది. ఇప్పుడు రెండోసారి అదే విధానాన్ని అనుసరించింది. దీనివల్ల 2022 జనవరి నాటికి రాష్ట్రాలకు వాస్తవంగా విడుదల చేయాల్సిన పన్నుల వాటాకంటే రూ.90,082 కోట్లు అదనంగా విడుదల చేసినట్లయిందని ఆర్థికశాఖ పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన రూ.1.59 లక్షల కోట్ల జీఎస్‌టీ పరిహారాన్ని అక్టోబరు నాటికే చెల్లించినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని