ఖమ్మంలో 54 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం

ఖమ్మం లకారం చెరువులో పూర్వ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కృష్ణావతార విగ్రహం ఆవిష్కృతం కానుంది. ఎన్టీఆర్‌ వందో జయంతి సందర్భంగా మే 28న దీనిని ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్‌ అభిమానుల ఆధ్వర్యంలో

Published : 21 Jan 2022 05:48 IST

మే 28న ప్రారంభానికి సన్నాహాలు

ఎన్టీఆర్‌ నమూనా విగ్రహం

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: ఖమ్మం లకారం చెరువులో పూర్వ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కృష్ణావతార విగ్రహం ఆవిష్కృతం కానుంది. ఎన్టీఆర్‌ వందో జయంతి సందర్భంగా మే 28న దీనిని ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్‌ అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 54 అడుగుల విగ్రహాన్ని రూ.2.3 కోట్లతో నిజామాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు.  లకారం చెరువు మధ్యలో తీగల వంతెన వద్ద ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. విగ్రహాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విగ్రహం తయారీ పనులు తుదిదశకు చేరినట్టు తెలుస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని