
4 రైల్వే వంతెనల నిర్మాణానికి మోక్షం
రూ.250 కోట్లు విడుదల చేసిన రాష్ట్రం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో రైల్వే వంతెనల నిర్మాణానికి మోక్షం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ సంయుక్తంగా వీటి నిర్మాణ వ్యయాన్ని భరించనున్నాయి. ఇందుకు రూ.404.82 కోట్లు వ్యయం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 250.02 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మిగిలిన రూ. 154.80 కోట్లను రైల్వే మంత్రిత్వ శాఖ ఖర్చు చేస్తుంది. షాద్‌నగర్‌లోని చటాన్‌పల్లి వద్ద వంతెన నిర్మాణానికి రూ.95 కోట్లు, ఆదిలాబాద్ మార్కెట్ యార్డు వద్ద వంతెనకు రూ.97.20 కోట్లు, పెద్దపల్లి పట్టణంలోని బ్రిడ్జికి రూ.119.50 కోట్లు, నిజామాబాద్‌లోని మాధవనగర్ వద్ద నిర్మించే వంతెనకు రూ.93.12. కోట్లు వ్యయం కానుంది. ఈ బ్రిడ్జిలను రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు వంతెనల నిర్మాణానికి ఒకదఫా ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.