‘ప్రమాణాలు లేని బొమ్మలు అమ్మితే చర్యలు’

నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఐఎస్‌ఐ మార్కు లేకుండా పిల్లల బొమ్మలు, ఆటవస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్‌) హైదరాబాద్‌

Published : 22 Jan 2022 05:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఐఎస్‌ఐ మార్కు లేకుండా పిల్లల బొమ్మలు, ఆటవస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్‌) హైదరాబాద్‌ డైరెక్టర్‌ కె.వి.రావు శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. హైదరాబాద్‌లో ప్రధాన బొమ్మల దుకాణాలు అయిన జస్ట్‌ ఫర్‌ యూ, టాయ్‌ కింగ్‌డం, హ్యమ్లేస్‌పైౖ బీఐఎస్‌ విజిలెన్స్‌ బృందాలు దాడులు చేసి వివిధ ఆటబొమ్మలను జప్తు చేసినట్లు తెలిపారు. బొమ్మల తయారీదారుల వివరాలు స్పష్టంగా లేని, నాణ్యత లేని, ఐఎస్‌ఐ గుర్తింపు లేని పలు ఎలక్ట్రిక్‌, నాన్‌ ఎలక్ట్రిక్‌ ఆట బొమ్మలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నాణ్యతలేని ఆటవస్తువులు విక్రయిస్తున్న వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. బీఐఎస్‌ చట్టం ప్రకారం.. ప్రజారోగ్యానికి నష్టం కలిగించేలా, బీఐఎస్‌ నాణ్యత పాటించకుండా ఆటవస్తువులను విక్రయించేవారిపై రూ.ఐదు లక్షల వరకు జరిమానా, రెండేళ్ల వరకు జైలుశిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని