ఈ నెల 24 వరకు 55 ప్యాసింజరు రైళ్ల రద్దు

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 55 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు చేసింది. ఈ నెల 24 వరకు ఈ బండ్లు అందుబాటులో ఉండవని వెల్లడించింది. ఈ మేరకు సంస్థ సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

Updated : 22 Jan 2022 06:09 IST

దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 55 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు చేసింది. ఈ నెల 24 వరకు ఈ బండ్లు అందుబాటులో ఉండవని వెల్లడించింది. ఈ మేరకు సంస్థ సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.


పుష్‌ పుల్‌ రైలు రద్దుతో ప్రయాణికుల అవస్థలు

కాజీపేట, న్యూస్‌టుడే: కాజీపేట-సికిందరాబాద్‌ మధ్య 07757, 07758 నంబర్లతో నడిచే పుష్‌పుల్‌ రైలును శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం రాత్రి ప్రకటించారు. దీంతో శుక్రవారం ఉదయం సికిందరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ఈ సమాచారం తెలియక ఇబ్బందులు పడ్డారు. ఉదయం కాజీపేట స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులకు సమాచార కేంద్రం వద్ద రద్దు బోర్డు కనిపించడంతో ఆందోళన చెందారు. ఇతర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఎక్కువ రుసుములు చెల్లించి వెళ్లారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు