
తిరుచానూరులో శ్రీయాగం ప్రారంభం
50 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహణ
తిరుచానూరు, తిరుమల, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రీయాగం ప్రారంభమైంది. ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శ్రీయాగాన్ని స్వయంగా నిర్వహిస్తున్నారు. వారం పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఉదయం యాగాన్ని ప్రారంభించారు. సుబ్బారెడ్డి దంపతులు అమ్మవారికి 34 గ్రా. బంగారు హారాన్ని కానుకగా అందజేశారు. 50ఏళ్ల కిందట చినజీయర్‌స్వామి తాతగారు శ్రీయాగం చేశారని, తర్వాత ఇంత కాలానికి అమ్మవారు తమకు యాగం చేసే భాగ్యాన్ని కల్పించారని సుబ్బారెడ్డి ఆనందం వ్యక్తంచేశారు. ఎస్వీబీసీ ద్వారా ప్రసారాలు తిలకించవచ్చన్నారు.
ముగియనున్న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం: ఈనెల 13న ప్రారంభమైన తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం శనివారంతో ముగియనుంది. గురువారం 36,092మంది భక్తులు దర్శించుకున్నారు.
Advertisement