మొక్క.. తానే నీళ్లు తీసుకుంటుంది ఎంచక్కా!

ప్రతి రోజూ గుర్తుపెట్టుకుని మొక్కలకు నీళ్లు పోయాలంటే కష్టమే కదా! మొక్కలకు అవసరమైనప్పుడు నీళ్లు వాటంతటవే కుండీలో పడితే బాగుంటుంది కదా! సరిగ్గా ఇదే ఆలోచనతో ఓ యువకుడు వినూత్న ఆవిష్కరణ చేశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు

Published : 22 Jan 2022 05:14 IST

సెన్సర్లతో పనిచేసేలా సెల్ఫ్‌ వాటరింగ్‌ ప్లాంట్‌ ఆవిష్కరణ

ప్రతి రోజూ గుర్తుపెట్టుకుని మొక్కలకు నీళ్లు పోయాలంటే కష్టమే కదా! మొక్కలకు అవసరమైనప్పుడు నీళ్లు వాటంతటవే కుండీలో పడితే బాగుంటుంది కదా! సరిగ్గా ఇదే ఆలోచనతో ఓ యువకుడు వినూత్న ఆవిష్కరణ చేశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన యాకర గణేశ్‌ ‘సెల్ఫ్‌ వాటరింగ్‌ ప్లాంట్‌’కు ప్రాణం పోశారు. మొక్క ఉండే కుండీ కింద ఒక డబ్బా ఉంటుంది. మొక్కకు నీరు అవసరమని సెన్సర్లు గుర్తించినప్పుడు అందులోని నీళ్లు పైకి వచ్చి కుండీలో పడతాయి. ఈ సెన్సర్లు బ్యాటరీతో పనిచేస్తాయి. వారానికోసారి డబ్బాలో నీళ్లు మారిస్తే చాలు..మొక్కకు అవసరమైనప్పుడల్లా నీళ్లు అందుతాయి. కుండీ నిండిన వెంటనే నీళ్లు తిరిగి డబ్బాలోకి వెళ్లిపోతాయి. ఒక్కోదానికి రూ.500 లోపే ఖర్చయిందని గణేశ్‌ తెలిపారు. ఆయన గతంలోనూ పలు ఆవిష్కరణలు చేశారు. ఇంటర్‌ వరకే చదివినా ఆయనలోని ఆవిష్కర్తను చూసి వాగ్దేవి ఇంజినీరింగ్‌ కళాశాల వారు తమ ఇంక్యుబేషన్‌ కేంద్రంలో పనిచేసేందుకు అవకాశం కల్పించారు.  

- ఈనాడు, వరంగల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని