పసిడి వర్ణంలో దర్శన వరుసలు

యాదాద్రి పంచ నారసింహుల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికత, సంప్రదాయం, ఆధునిక సాంకేతిక నైపుణ్యం కలబోతతో మహాదివ్యంగా ఆవిష్కృతమవుతోంది. అందులో భాగంగా పసిడి వర్ణంతో కూడిన దర్శన వరుసల సముదాయం ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి.

Published : 22 Jan 2022 05:21 IST

యాదాద్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు

యాదాద్రి పంచ నారసింహుల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికత, సంప్రదాయం, ఆధునిక సాంకేతిక నైపుణ్యం కలబోతతో మహాదివ్యంగా ఆవిష్కృతమవుతోంది. అందులో భాగంగా పసిడి వర్ణంతో కూడిన దర్శన వరుసల సముదాయం ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. వైష్ణవం ఉట్టిపడేలా ఐరావతం, శంఖు, చక్ర, తిరునామాలు, మహా విష్ణువు రూపాలు, మందిరాల ఆకృతితో దీన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తయారు చేశారు. ఎల్‌.ఎం.6 అల్యూమినియం మెటల్‌పై బ్రాస్‌(ఇత్తడి) డ్రై కోటింగ్‌తో 501 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పు, పది అడుగుల ఎత్తుతో ఈ వరుసలు రూపొందాయి. వృద్ధులు సేద తీరేందుకు మధ్యలో బెంచీలతో 12శ్రీ12 అడుగులతో ఐదు బాక్స్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఇందులోంచి బయటకు వెళ్లడానికి పది చోట్ల ప్రత్యేక ద్వారాలు ఉన్నాయని ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.  

- న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని