పచ్చదనం పెంపు.. సీఎం కేసీఆర్‌ ఘనతే

రాష్ట్రంలో పచ్చదనం పెంపు ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. పచ్చదనం పెంపొందించడానికి హరితహారంతో పాటు పట్టణాలు, గ్రామాల్లో గ్రీన్‌ బడ్జెట్‌ను చట్టంలోనే

Published : 22 Jan 2022 05:22 IST

మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పచ్చదనం పెంపు ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. పచ్చదనం పెంపొందించడానికి హరితహారంతో పాటు పట్టణాలు, గ్రామాల్లో గ్రీన్‌ బడ్జెట్‌ను చట్టంలోనే పొందుపరచడం సీఎం కేసీఆర్‌ దూరదృష్టికి నిదర్శనమని ఆయన ట్విటర్‌లో తెలిపారు. మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం, 2011-21 మధ్యకాలంలో  తెలంగాణలో అటవీ విస్తీర్ణం 4866 హెక్టార్లు పెరగడం గొప్ప విషయమని ప్రపంచ పర్యావరణ వేత్త ఏరిక్‌ సోలీహిమ్‌ ట్విటర్‌ ద్వారా ప్రశంసించగా మంత్రి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

అర్బన్‌ పార్కులు... అద్భుత ప్రదేశాలు

ప్రకృతి ఒడిలో గడిపేందుకు రాష్ట్రంలోని అర్బన్‌ పార్కులు అద్భుతమైన ప్రదేశాలని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం ట్విటర్‌లో తెలిపారు. హరితహారంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అర్బన్‌ పార్కుల్లో పలు సౌకర్యాలను కల్పించిందని చెప్పారు. నడక, ప్రకృతి, పక్షుల వీక్షణం., సైక్లింగ్‌ లాంటి వాటితో సరదాగా గడపవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం  ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా అర్బన్‌ పార్కుల సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని