గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకుంటాం

గ్రానైట్‌ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకుంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లు తెలిపారు. గ్రానైట్‌ యజమానుల సంఘం ప్రతినిధులతో

Updated : 23 Jan 2022 06:08 IST

మంత్రి పువ్వాడ, సీఎస్‌ సోమేశ్‌ల హామీ

గ్రానైట్‌ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకుంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లు తెలిపారు. గ్రానైట్‌ యజమానుల సంఘం ప్రతినిధులతో వారు శనివారం బీఆర్‌కేభవన్‌లో సమావేశం నిర్వహించారు. తెరాస లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, అధికారులు కూడా పాల్గొన్నారు. గ్రానైట్‌ సహా అనుబంధ చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ఇతర సమస్యలపై చర్చించారు. మంత్రి, సీఎస్‌లు మాట్లాడుతూ, ‘గ్రానైట్‌ పరిశ్రమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు త్వరలోనే చర్యలు చేపడతాం’ అని తెలిపారు. గ్రానైట్‌ క్వారీ యజమానుల సంఘం అధ్యక్షుడు రవిచంద్ర తదితరులు పరిశ్రమ సమస్యలను వివరించారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు