గోదాముల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో!

రాష్ట్రంలో గోదాముల లెక్కలన్నీ ఆన్‌లైన్‌లోకి రానున్నాయి. అందులో ఏమేం సరకులున్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్నిరోజుల నుంచి నిల్వ ఉన్నాయనే సమాచారమంతా ఆన్‌లైన్‌లో కనిపించనుంది. ఇందుకోసం

Published : 23 Jan 2022 04:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గోదాముల లెక్కలన్నీ ఆన్‌లైన్‌లోకి రానున్నాయి. అందులో ఏమేం సరకులున్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్నిరోజుల నుంచి నిల్వ ఉన్నాయనే సమాచారమంతా ఆన్‌లైన్‌లో కనిపించనుంది. ఇందుకోసం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతీ సమాచారం నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పొలం సర్వే నంబరు, అక్కడ పండిన పంట ఎంత, ఎంత అమ్మారు, ఎవరు కొన్నారు, ఏ లారీలో ఏ గోదాముకు ఎప్పుడు తీసుకెళ్లారు, నిల్వ చేసిన తేదీ, అక్కడి నుంచి తిరిగి తరలించిన తేదీ వంటి సమాచారమంతా ఈ సంస్థ సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు కొంతమేర మద్దతు ధరకు కొంటున్నాయి. గోదాములకు తరలించి ప్రజలకు పంపిణీ కోసం ఎక్కడ అవసరమైతే అక్కడికి తరలిస్తారు. ఇంతకాలం ఈ వివరాలన్నీ కాగితాలపైనే ఉన్నందున పర్యవేక్షణకు కొంత ఇబ్బంది అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 124 చోట్ల ఉన్న పెద్దగోదాములలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిల్వలు పెడుతోంది. ఈ నెల 25కల్లా వివరాల నమోదు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరక్టర్‌ జితేందర్‌ ‘ఈనాడు’కు చెప్పారు. ఆన్‌లైన్‌లో నమోదు వల్ల పారదర్శకతకు వీలుంటుందని, అక్రమాలకు అవకాశం ఉండదని అన్నారు. హైదరాబాద్‌ నుంచే రాష్ట్రమంతా పర్యవేక్షించడం సులభమవుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని