ఉద్యోగుల సంక్షేమంలోతెలంగాణ దేశానికే మార్గదర్శి

ప్రభుత్వ, కార్పొరేషన్ల ఉద్యోగుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా ఉందని, కేంద్రం కంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులను కన్నబిడ్డల్లా

Published : 23 Jan 2022 04:45 IST

జీవో 317పై భాజపా, కాంగ్రెస్‌ల అనవసర రాద్ధాంతం
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌ : ప్రభుత్వ, కార్పొరేషన్ల ఉద్యోగుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా ఉందని, కేంద్రం కంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారన్నారు. శనివారం హరితప్లాజాలో ఆయన తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య  దైనందినిని ఆవిష్కరించారు. సమాఖ్య ఛైర్మన్‌ రాజేశం, ప్రధాన కార్యదర్శి జీటీ జీవన్‌, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ఉద్యోగులకు ఎంతో మేలు చేసేందుకు 317 జీవోను కేసీఆర్‌ తేగా... దానిపై కాంగ్రెస్‌, భాజపా, ఇతర పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. జీవో గురించి ఏ మాత్రం తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. కేంద్రం కార్పొరేషన్లను మూసేస్తుంటే... రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేస్తున్నాం’ అని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ల ఛైర్మన్లు వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, నగేశ్‌, ఎమ్మెల్సీలు ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.

నూతనక్రీడా విధానంపై వచ్చే కేబినెట్‌లో ముసాయిదా
వచ్చే మంత్రిమండలి సమావేశంలో రాష్ట్ర క్రీడావిధానంపై ముసాయిదాను సమర్పిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు, మంత్రివర్గ ఉపసంఘం సూచనలు, సలహాల చేరుస్తూ దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో నూతన క్రీడా విధానంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని నీరా కేఫ్‌ నిర్మాణ పనులు, మహబూబ్‌నగర్‌లోని శిల్పారామం, ట్యాంక్‌బండ్‌ అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రం, వంగరలోని పీవీ విజ్ఞాన వేదికను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని