
తెలంగాణ శిలలు.. హస్తినలో ఘన స్మారకాలు!
ఖమ్మం జిల్లాకు చెందిన నల్లటి గ్రానైట్ శిలలు దేశ రాజధానిలో ఘన చరిత్రకు ఆనవాళ్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇండియా గేట్ వద్ద ఆగస్టు 15న ఆవిష్కరించబోయే ‘నేతాజీ’ సుభాష్‌చంద్ర బోస్ విగ్రహాన్ని తెలంగాణకు చెందిన బ్లాక్ గ్రానైట్‌తో చెక్కబోతున్న విషయం తెలిసిందే. దిల్లీలో 31 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పుతో నిర్మించిన పోలీసుల అమరవీరుల స్తూపాన్నీ ఖమ్మం జిల్లా నుంచి తెప్పించిన 270 టన్నుల రాయి ద్వారానే మలిచారు. జాతీయ పోలీసు మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. వాజ్‌పేయీ సమాధిని ఖమ్మం నుంచి తరలించిన ఏకశిల గ్రానైట్‌తోనే నిర్మించారు.
- ఈనాడు, దిల్లీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.