
ఆదివాసీ మహిళల ఆరోపణలపై విచారణ
మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం
ఈటీవీ, ఖమ్మం: కట్టెల కోసం వెళ్లిన ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారి మహేశ్ అసభ్యంగా ప్రవర్తించారంటూ బాధితులు చేసిన ఆరోపణలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించగా ఐటీడీఏ పీవో గౌతమ్ శనివారం ములకలపల్లి తహసీల్దార్ వీరభద్రానికి ఆ బాధ్యతలు అప్పగించారు.
పోలీసులకు పరస్పర ఫిర్యాదులు
ఈ నెల 19న మధ్యాహ్నం కట్టెల కోసం అడవికి వెళ్లిన తమపై మహేశ్ అసభ్యంగా ప్రవర్తించారని, 15 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశారని ఆదివాసీ మహిళలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అదే ఠాణాలో మహేశ్ కూడా ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన సమయంలో తీసిన వీడియోను అటవీ అధికారులు విడుదల చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.