నిర్మాణ ధరలు పెంచాలి

నిర్ణీత ప్రమాణ నిర్మాణ(ఎస్‌ఎస్‌ఆర్‌) ధరలు పెంచాలని, రాష్ట్రంలోని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల పరిధిలో అవి ఒకే విధంగా ఉండేలా నిర్ణయించాలని  మంత్రి జగదీశ్‌రెడ్డికి తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్టర్ల సంఘం విన్నవించింది.

Published : 24 Jan 2022 04:56 IST

మంత్రికి గుత్తేదారుల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: నిర్ణీత ప్రమాణ నిర్మాణ(ఎస్‌ఎస్‌ఆర్‌) ధరలు పెంచాలని, రాష్ట్రంలోని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల పరిధిలో అవి ఒకే విధంగా ఉండేలా నిర్ణయించాలని  మంత్రి జగదీశ్‌రెడ్డికి తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్టర్ల సంఘం విన్నవించింది. ఆదివారం మంత్రిని సంఘ సభ్యులు కలసి సమస్యలు వివరించారు. ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుత రెండు డిస్కం ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వారు మంత్రికి వివరించారు. అంతేగాకుండా విద్యుత్‌ కాంట్రాక్టు పనులకు అధికారులు రూపొందించే అంచనా వ్యయాలలో కార్మికులకు ఇచ్చే ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఇతర రుసుములు కలపాలని కోరారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు శివకుమార్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే మాజిద్‌, పర్వతాలు అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని