వామపక్ష తీవ్రవాద బాధితులకు ఏం చేశారు?

వామపక్ష తీవ్రవాదం కారణంగా నిర్వాసితులైన గిరిజన కుటుంబాల గుర్తింపు, పునరావాసానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు గిరిజనుల

Published : 24 Jan 2022 04:56 IST

తెలుగు రాష్ట్రాలకు ఎన్‌సీఎస్‌టీ నోటీసులు

దిల్లీ: వామపక్ష తీవ్రవాదం కారణంగా నిర్వాసితులైన గిరిజన కుటుంబాల గుర్తింపు, పునరావాసానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు గిరిజనుల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీఎస్‌టీ) తాజాగా నోటీసులిచ్చింది. ఇదే విషయమై సర్వే నిర్వహించాలని 2019లోనే తెలుగు రాష్ట్రాలను ఎన్‌సీఎస్‌టీ, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కోరాయి కొవిడ్‌ కారణంగా ఈ సర్వే చేపట్టలేకపోతున్నామంటూ రెండు రాష్ట్రాలు చెబుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈనెల 12న మరోమారు నోటీసులిచ్చామని, 30 రోజుల్లోపు నివేదిక కోరామని ఎన్‌సీఎస్‌టీ అధికారి తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, సల్వాజుడుంల పోరు కారణంగా సుమారు 50 వేల మంది గిరిజనులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలోని అడవుల్లో 248 చోట్ల స్థిరపడ్డారని.. ఎలాంటి గుర్తింపు లేకుండా, దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని గిరిజన హక్కుల ఉద్యమకారుడు శుభ్రాంసు చౌధరి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని