3.79 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు పది రోజులపాటు 3.79 లక్షల మంది భక్తులకు వైకుంఠ.....

Published : 24 Jan 2022 05:04 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు పది రోజులపాటు 3.79 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. వెనుకబడిన ప్రాంతాల నుంచి 6,949, అలిపిరి నడకమార్గంలో 26,240 మంది, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లపై 1.66 లక్షలు, సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ ద్వారా 83 వేలు, శ్రీవాణి ట్రస్టు ద్వారా 15,465, దాతలు 7,917, వర్చువల్‌ సేవా టికెట్ల కోటాలో 43,250 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ పది రోజుల్లో తితిదే 4లక్షల లడ్డూలు అందించగా, హుండీ కానుకలుగా రూ.26.61 కోట్లు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని