అది భూగర్భ జలాశయం

కడప జిల్లాలో బ్రిటీష్‌ కాలం నాటి భూగర్భ జలాశయం వెలుగుచూసింది. మొదట అందరూ సొరంగ కారాగారంగా భావించారు. సమగ్రంగా పరిశీలించిన అనంతరం జలాశయంగా గుర్తించారు.

Updated : 24 Jan 2022 05:04 IST

కడప జిల్లాలో బ్రిటీష్‌ కాలం నాటి భూగర్భ జలాశయం వెలుగుచూసింది. మొదట అందరూ సొరంగ కారాగారంగా భావించారు. సమగ్రంగా పరిశీలించిన అనంతరం జలాశయంగా గుర్తించారు. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ అగ్రహారం గ్రామ సమీపంలో వెలుగుచూసిన ఈ భూగర్భ జలాశయాన్ని 1890లో బ్రిటీష్‌ వారు నిర్మించినట్లు అక్కడ శిలాఫలకం ఉంది. తాగునీటి అవసరాల కోసం ఇక్కడ నీటిని నిల్వ చేసుకునేవారని, అవసరమైనప్పుడు గ్రావిటీ ద్వారా కడపకు తీసుకెళ్లేవారని నిపుణులు చెబుతున్నారు. కట్టడంలో సిమెంటు, కాంక్రీటు వాడకుండా కేవలం సున్నం గచ్చుతో నిర్మించిన జలాశయం నేటికీ చెక్కుచెదరక పోవడం విశేషం.

- న్యూస్‌టుడే, కడప(యోవేవి)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని